
సినిమాలు

రాకింగ్ స్టార్ యష్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను చూపించేందుకు సిద్ధమయ్యాడు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ టాక్సిక్‌కు నార్త్ బెల్ట్‌లో మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తొలి రోజే హిందీ నెట్ వసూళ్లలో రూ.50 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. యష్ మాస్ క్రేజ్‌తో పాటు సినిమా స్టైలిష్ ప్రెజెంటేషన్ ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు సమాచారం.
టాక్సిక్‌లో కియారా అద్వానీ, హుమా ఖురేషీ, తారా సుతారియా వంటి బాలీవుడ్ నటీమణులతో పాటు నయనతార, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు. భారీ తారాగణం, యష్‌కు ఉన్న క్రేజ్ కారణంగా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తొలి రోజు వసూళ్ల తర్వాత టాక్సిక్ నార్త్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!