

బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం. తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్నని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి.. డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపుతో అప్రమత్తమైన తుషార్ కపూర్ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. వారం రోజుల క్రితమే ఆయన ఫిర్యాదు చేసినప్పటికీ.. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఈ విషయాన్ని వెంటనే బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై క్రైమ్ బ్రాంచ్, యాంటీ ఎక్స్టార్షన్ సెల్ దర్యాప్తు చేపట్టాయి.
మరోవైపు, బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి నిజంగా హ్యారీ బాక్సరేనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాల్‌కు సంబంధించిన ఆడియోను హ్యారీ బాక్సర్ అధికారిక వాయిస్ శాంపిల్స్‌తో పోల్చి చూడగా.. రెండింటి మధ్య పొంతన లేదని ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి బిష్ణోయ్ గ్యాంగ్ పేరును ఉపయోగించి నటుడిని బెదిరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని వెనుక ఎవరున్నారు? అనే విషయాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తుషార్ కపూర్ ఇప్పటివరకు 30కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించడంతో పాటు కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఆయన సోదరి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!