

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ శక్తుల మద్దతుతోనే అధికారంలో కొనసాగుతున్నారని రాహుల్ గాంధీ ఇటీవల ఎక్స్‌లో ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను విదేశీయులే నియంత్రిస్తున్నారని కూడా ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి సీఆర్ కేశవన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తప్పుబడుతూ ఆయనపై ఘాటైన విమర్శలు చేశారు.
రాహుల్ గాంధీ ఒక అసహ్యకరమైన, జుగుప్సాకరమైన వ్యక్తి అంటూ కేశవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరాధారమైన, బలహీనమైన ఆరోపణలు చేయడం, చివరకు నవ్వులపాలవడం రాహుల్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. 2023 మార్చిలో యూకే పర్యటన సందర్భంగా భారత ప్రజాస్వామ్యం గురించి రాహుల్ ప్రతికూలంగా మాట్లాడిన విషయాన్ని కూడా కేశవన్ ప్రస్తావించారు. దేశ ప్రతిష్ఠను విదేశాల్లో దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వాస్తవానికి భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని కోరింది రాహుల్ గాంధీయేనని ఆయన మండిపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!