

టాలీవుడ్ నటి వైష్ణవి చైతన్య తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న డేటింగ్, పెళ్లి రూమర్లకు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా యంగ్ హీరో ఆనంద్ దేవరకొండతో ఆమె ప్రేమలో ఉందంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ‘బేబీ’, ‘ఎపిక్’ చిత్రాల్లో కలిసి నటించడంతో వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని చూసి నిజ జీవితంలోనూ ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు వైరల్ అయ్యాయి. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే చర్చలు కూడా సాగాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో స్పందించిన వైష్ణవి, తమ మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదని స్పష్టం చేశారు.
తామిద్దరం మంచి కోస్టార్స్ మాత్రమే కాకుండా మంచి స్నేహితులమని వైష్ణవి తెలిపారు. సినీ ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి తమ మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతోందని చెప్పారు. ఆనంద్ దేవరకొండ పెళ్లి గురించి వస్తున్న చర్చలపైనా ఆమె స్పందించారు. ఆనంద్ వచ్చే మూడేళ్లలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. అయితే తనకు మాత్రం పెళ్లి గురించి ఆలోచించడానికి ఇంకా చాలా సమయం ఉందని, ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని వైష్ణవి స్పష్టం చేశారు. దీంతో ఆనంద్‌తో తనపై వస్తున్న డేటింగ్ రూమర్లకు ఆమె చెక్ పెట్టారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!