

నటి వరలక్ష్మీ శరత్‌కుమార్పై దర్శకుడు సంజీవ్ మేగోటి చేసిన ఆరోపణలు చర్చకు దారితీశాయి. వీరి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం పోలీస్ కంప్లైంట్ ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్లలో పాల్గొనలేదని, డబ్బులు తీసుకున్నప్పటికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదని దర్శకుడు ఆరోపించగా, వరలక్ష్మి తాను అన్ని కార్యక్రమాలకు హాజరైనట్లు స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని పెద్దది చేయాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు.
తాను అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉన్నానని, సినిమా కార్యక్రమాలకు హాజరయ్యానని ఆమె వెల్లడించారు. ఇటీవల జరిగిన ఈవెంట్‌లో దర్శకుడు ఏమి మాట్లాడారో పూర్తిగా తెలియదని చెప్పారు. కొన్ని విషయాల్లో తనకంటూ అభిప్రాయాలు ఉన్నాయని, అందుకే ఈ ఆరోపణలపై బహిరంగంగా చర్చించాలనుకోవడం లేదని అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లో తాను ఆరోపణలు చేయకుండా తన పనిపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!