

ఆగస్టులో పలువురు స్టార్ హీరోల సినిమాల నుంచి టీజర్లు లేదా వీడియో గ్లింప్స్‌లు వస్తాయని అభిమానులు భారీగా ఆశించారు. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా వీడియో కంటెంట్ మాత్రం బయటకు రాలేదు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ నుంచి ప్రత్యేక వీడియో గ్లింప్స్ వస్తుందని భావించినా, చివరకు ఫస్ట్ లుక్ పిక్స్‌తోనే సరిపెట్టారు. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ నుంచి కూడా వీడియో టీజర్ వస్తుందని ఎదురుచూశారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ కంటెంట్ వాయిదా పడింది.
అభిమానులకు మాత్రం పోస్టర్ మాత్రమే అందింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’పై పడింది. ఈ నెలలోనే ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రత్యేక వీడియో గ్లింప్స్ లేదా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే మహేష్, ప్రభాస్ సినిమాల నుంచి ఆశించిన వీడియో కంటెంట్ రాకపోవడంతో, ‘రాకా’ అయినా ఆ లోటును భర్తీ చేస్తుందా అనే ఆసక్తి నెలకొంది. మరి మేకర్స్ ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తారో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!