
రాజకీయాలు

మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ, దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ కలయికలో రూపొందుతున్న కొత్త చిత్రానికి ‘విజయం’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ‘నేరం’, ‘ప్రేమమ్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత 12 ఏళ్లకు ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ కలిసి పనిచేస్తుండటంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కేరళలోని ఎర్నాకుళంలోని పద్మ థియేటర్‌లో అభిమానుల సమక్షంలో టైటిల్ ప్రకటన వీడియోను విడుదల చేశారు. ఇప్పటికే ఈ వీడియోకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభిస్తోంది. నివిన్ పౌలీ కెరీర్‌లో ఇది 50వ చిత్రం కావడం విశేషం. రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అల్ఫోన్స్ పుత్రేన్ రచన, దర్శకత్వం, ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!