

ఈ శుక్రవారం (నవంబర్ 13) ‘ఇట్లు అర్జున’ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. కొత్త హీరో నటిస్తున్న చిన్న సినిమానే అయినప్పటికీ, నాగార్జున, ఎన్టీఆర్, అఖిల్, రామ్ చరణ్ వంటి టాలీవుడ్ ప్రముఖులు ప్రమోషన్లలో పాల్గొనడంతో ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ఆసక్తి పెరిగింది. ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్న అనీష్ రెడ్డి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఏఎంఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి చిన్న కుమారుడు.
మహేశ్ రెడ్డికి గతంలోనే టాలీవుడ్‌తో పరిచయాలు ఉన్నాయి. నాగార్జున హీరోగా నటించిన ‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాలను ఆయన నిర్మించారు. అప్పటినుంచి నాగార్జునతో ఏర్పడిన స్నేహం కారణంగా అనీష్ తొలి సినిమాకు ఆయన మద్దతుగా నిలిచారు. ‘ఇట్లు అర్జున’కు నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తూ, సినిమా గ్లింప్స్‌కు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రైలర్‌ను విడుదల చేయగా, నాగార్జున తన కుమారుడు అఖిల్‌తో కలిసి మ్యూజిక్ కన్సర్ట్‌కు హాజరయ్యారు. రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాలో అనీష్ మూగవాడి పాత్రలో నటిస్తుండగా, మలయాళ నటి అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సినిమాతో అనీష్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారో విడుదల తర్వాత తెలియనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!