

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భారతీయ చిత్ర పరిశ్రమలో తన ఉనికిని చాటుకుంటున్నారు. 2019లో విడుదలైన ‘ది స్కై ఈజ్ పింక్’ తర్వాత ఆమె మరో భారతీయ సినిమాలో నటించలేదు. అంతర్జాతీయ ప్రాజెక్టులపై దృష్టి సారించిన ప్రియాంక, వచ్చిన పలు ఆఫర్లలో కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’ మాత్రమే ఆమె నటించేందుకు అంగీకరించిన భారతీయ చిత్రంగా తెలుస్తోంది.
మరోవైపు, తన నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్ ద్వారా ప్రియాంక నిర్మాతగా కూడా బిజీ అవుతున్నారు. 2016లో విజయం సాధించిన మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్’కు సీక్వెల్‌గా ‘వెంటిలేటర్ 2’ను అధికారికంగా ప్రకటించారు. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన రాజేష్ మాపుస్కర్ ఈ సీక్వెల్‌ను కూడా తెరకెక్కించనున్నారు. ప్రియాంక చోప్రా, ఆమె తల్లి డాక్టర్ మధు చోప్రా, రాజేష్ మాపుస్కర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ప్రియాంక ఇందులో నటించడం లేదు. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!