

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు థియేటర్లకే పరిమితమైన సినిమా వినోదం ఇప్పుడు ఇంట్లోనే అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు.. కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ జాబితాలో ‘డార్క్ సీక్రెట్స్’ కూడా చేరింది.
అప్సర రాణి, నైనిక అనసూయ, జయశ్రీ, నీలిమ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అవినాష్ కొకటి దర్శకత్వం వహించారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ ప్రారంభమైన ‘డార్క్ సీక్రెట్స్’.. ప్రస్తుతం టాప్ 10 ఇండియన్ రెంటల్ మూవీస్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. వివిధ భాషల చిత్రాలతో పోటీ పడుతూ ఈ స్థాయికి చేరుకోవడం చిత్ర బృందానికి ప్రత్యేక విజయంగా నిలిచింది.
మానవ మనస్తత్వంలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నంగా ఈ ఆంథాలజీ డ్రామాను తెరకెక్కించారు. మనుషుల జీవితాల్లో దాగి ఉన్న రహస్యాలు, కోరికలు, భావోద్వేగాలు, సంబంధాల సంక్లిష్టతల చుట్టూ కథలు సాగుతాయి. ప్రతి కథలోని రహస్యం బయటపడినప్పుడు చోటుచేసుకునే పరిణామాలను ఆసక్తికరంగా చూపించారు. చిన్న చిత్రాలకు ఓటీటీ వేదికలు ఎంతటి అవకాశాలను కల్పిస్తున్నాయో ‘డార్క్ సీక్రెట్స్’ మరోసారి నిరూపిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!