

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు ‘ఇరుముడి’, ‘మొదటి రాత్రి’ చిత్రాలతో వరుస విజయాలు దక్కాయి. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా బృందం మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు రెండు చిత్రాల బృందాలను ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసింది.
మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒకే నిర్మాణ సంస్థకు చెందిన రెండు చిత్రాలు ఒకేసారి నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ నాన్-ఇంగ్లిష్ చిత్రాల జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలవడం ఇదే తొలిసారి. ‘ఇరుముడి’, ‘మొదటి రాత్రి’ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ తమకు గర్వకారణమని నిర్మాణ సంస్థ పేర్కొంది. భాషలు, సరిహద్దులను దాటి ప్రేక్షకులను ఆకట్టుకునే కథల శక్తికి ఈ స్పందన నిదర్శనమని తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!