
జనరల్

బాహుబలి అభిమానులకు ఇటీవల ఊహించని సర్ప్రైజ్ లభించింది. ఎంతోకాలంగా ‘బాహుబలి: ది ఎపిక్’ గురించి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో, నిర్మాతలు కొత్తగా ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ అనే ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ జూన్ 26, 2026న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు వెల్లడించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
అయితే ‘ది టార్చ్‌బేరర్’ అసలు ఏమిటన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. ఇది ‘బాహుబలి: ది ఎపిక్’కు కొత్త పేరు కాదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఫ్రాంచైజీ ప్రయాణం, ప్రభావం, వారసత్వాన్ని చూపించే డాక్యుమెంటరీ అయ్యి ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే చిత్రబృందం పూర్తి గోప్యత పాటిస్తుండటంతో అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జూన్ 26 దగ్గరపడుతున్న కొద్దీ ఈ ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ మరింత పెరుగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!