

ఓటీటీ వేదికలపై ప్రతివారం కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అయితే కొన్ని చిత్రాలు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలవుతుంటాయి. అలాంటి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ లవ్ స్టోరీ కామెడీ చిత్రం ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. ఎలన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్‌గా నటించగా, రాధిక కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘ప్యార్ ప్రేమ కళ్యాణం’ ఆగస్టు 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. కథ విషయానికొస్తే.. పెళ్లి తర్వాత సాధారణంగా భార్య భర్త ఇంటికి వెళ్తుంది. కానీ ఈ సినిమాలో భార్య తన భర్తను ఇల్లరికం రావాలని కోరుతుంది. ఆమె కోరికను అంగీకరించిన తర్వాత అత్తారింట్లో అతడు ఎదుర్కొనే ఇబ్బందులు, వాటి చుట్టూ జరిగే పరిణామాలను వినోదాత్మకంగా చూపించనున్నారు. సీరియస్ అంశాన్ని కామెడీగా తెరకెక్కించిన తీరు ట్రైలర్‌లో ఆసక్తిని కలిగిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!