

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’ విడుదలకు ముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఈ సినిమా కోసం ఒకే సెషన్లో 37 మంది పెర్ఫార్మర్లను ఒకేసారి రియల్‌టైమ్ మోషన్ క్యాప్చర్ చేయడంతో ‘Most People Motion-Captured in Real-Time’ విభాగంలో రికార్డు నమోదైంది. 2026 ఫిబ్రవరిలో ఈ రికార్డు ప్రయత్నం జరగగా, సెప్టెంబర్ 15న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ధ్రువీకరించింది.
ఈ ఘనతను పురస్కరించుకుని మేకర్స్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇప్పటివరకు ఈ ఈవెంట్‌కు సంబంధించిన చిన్న ప్రోమోను మాత్రమే విడుదల చేశారు. తాజాగా పూర్తి ఈవెంట్‌ను సన్ పిక్చర్స్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్, అట్లీతో పాటు చిత్రబృందం పాల్గొన్న ఈ గిన్నిస్ రికార్డు వేడుకలో ఏం జరిగింది, ఎలాంటి విశేషాలు చోటుచేసుకున్నాయి అనే విషయాలను పూర్తి స్థాయిలో తెలుసుకునే అవకాశం ప్రేక్షకులకు లభించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!