
ఓటీటీ

తమిళంలో రూపొందిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లింగం జూన్ 26 నుంచి ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పూర్ణిమ రవి, నిఖిలా శంకర్, దివ్య భారతి, విమల్, బోస్ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు ప్రశాంత్ పాండ్యరాజ్, లక్ష్మీ శరవణకుమార్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సస్పెన్స్, గ్రిట్టీ విజువల్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఒక మిస్టీరియస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ సాగే ఈ కథలో క్రైమ్ ప్రపంచంలోని చీకటి కోణాలను చూపించనున్నారు. శక్తివంతమైన నటన, ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ, ఉత్కంఠభరితమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. జూన్ 26 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌పై తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!