
గాసిప్స్

హర్ష చెముడు నటించిన తాజా వెబ్ సిరీస్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నెట్‌ఫ్లిక్స్ రోజువారీ టాప్ 10 షోల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రముఖ హిందీ కామెడీ టాక్ షో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరడం విశేషంగా మారింది. తెలుగు వెబ్ సిరీస్ అనూహ్యంగా అగ్రస్థానంలో నిలవడంతో ఈ షోపై ఆసక్తి పెరిగింది.
బాబు డేగాల దర్శకత్వం వహించిన ఈ వినోదాత్మక సిరీస్‌లో హైపర్ ఆది, జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్ తదితరులు నటించారు. ఈ సిరీస్ ఈటీవీ విన్‌లోనూ అందుబాటులో ఉంది. ఇప్పటికే దీనికి మంచి స్పందన లభించినట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్త టాప్ 10 జాబితాను రేపు అప్‌డేట్ చేయనుండటంతో, ఈ సిరీస్ వీక్షణలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!