

ఇండిపెండెన్స్ డే-వీకెండ్ సందర్భంగా ఈ వారం తెలుగు ప్రేక్షకుల కోసం థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో పలు కొత్త సినిమాలు, సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. థియేటర్లలో విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, అగధ, పళ్లబురుసు, అనకాపల్లి సినిమాలు కూడా విడుదలకు సిద్ధమయ్యాయి. విశాల్ నటించిన డబ్బింగ్ చిత్రం మకుటం కూడా ఈ లైనప్‌లో ఉంది. అయితే, పలు సినిమాలు ఒకేసారి వస్తున్నప్పటికీ వీటిపై ఇప్పటివరకు పెద్దగా బజ్ కనిపించడం లేదు.
మరోవైపు ఓటీటీల్లో ఈ వారం మరింత సందడి కనిపించనుంది. సుమారు 22 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. రష్మిక మందన్న నటించిన కాక్‌టెయిల్ 2, భారతభాగ్య విధాత, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి సినిమాలు వీటిలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇండిపెండెన్స్ డే సెలవు కలిసిరావడంతో వీకెండ్‌లో ప్రేక్షకులకు మరింత వినోదం దక్కనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!