

తెలంగాణలో కరువు మండలాల ఎంపిక అశాస్త్రీయంగా జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అత్యధిక లోటు వర్షపాతం నమోదైన అనేక మండలాలను కరువు జాబితాలో చేర్చకుండా, మొక్కుబడిగా కరువు మండలాలను ప్రకటించారని విమర్శించారు. ఈ ప్రక్రియలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. 35 శాతం లోటు వర్షపాతం నమోదైన మండలాలు సైతం కరువు జాబితాలో లేకపోవడం బాధాకరమని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన అన్నారు.
హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అనేక మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం వాటిని ఎందుకు గుర్తించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కరువు మండలాల ఎంపికకు ఉపయోగించిన అధికారిక గణాంకాలు, ప్రమాణాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా కరువు మండలాలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!