

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రచించిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’పై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనతే ఆమెకు మద్దతుగా నిలిచారు. తన జీవితంలోని అనుభవాలు, వ్యక్తిగత విషయాలను పంచుకునే పూర్తి హక్కు సోనియా గాంధీకి ఉందని ఆమె పేర్కొన్నారు. మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు తన కోణంలో జరిగిన సంఘటనలను వివరించినందుకు బీజేపీ ఎందుకు విమర్శలు చేస్తోందని సుప్రియా ప్రశ్నించారు.
నవంబర్ 10న విడుదలైన 544 పేజీల ఈ పుస్తకంలో ఇటలీలో సోనియా బాల్యం, రాజీవ్ గాంధీతో వివాహం, ఆయన హత్య, సోనియా రాజకీయ ప్రస్థానం వంటి అంశాలను ప్రస్తావించారు. ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక హింస, బాబ్రీ మసీదు కూల్చివేత, బోఫోర్స్ వివాదం వంటి కీలక పరిణామాలపైనా ఆమె తన అభిప్రాయాలను పొందుపరిచారు. అయితే, ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా చరిత్రను తనకు అనుకూలంగా వివరించారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ నేతలు ఆమెకు తన జీవిత కథను చెప్పుకునే అవకాశం ఇవ్వాలని సమర్థిస్తున్నారు. దీంతో ఈ పుస్తకం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!