4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు!

Writer: Shivani K 10:49 AM, 4 నవంబర్, 2026
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు!

మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు పేరు ఖరారైనట్లు సమాచారం. మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరో ఒకటి, రెండు రోజుల్లో ఆయన అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బీజేపీ అధిష్ఠానం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి, ఆశావహుల పేర్లను సేకరించింది. అంతర్గత సర్వేలు, రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం రాంచందర్‌రావు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో ఆయనకు గతంలో ఉన్న అనుభవం కూడా ఎంపికకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

మరోవైపు వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీసీ అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ స్థానం కోసం డాక్టర్ వన్నాల వెంకట రమణ, రిటైర్డ్ ఉపాధ్యాయుడు భిక్షం గౌడ్ పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. భిక్షం గౌడ్ త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ స్థానం నుంచి సామ రామ్మోహన్‌రెడ్డి, వరంగల్‌–ఖమ్మం–నల్గొండ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున పాలకూరి అశోక్ గౌడ్ పేరును తీన్మార్ మల్లన్న ప్రకటించారు. బీఆర్ఎస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. దీంతో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో రాజకీయ పోరు ఆసక్తికరంగా మారుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా సెనేట్‌లో ఆధిపత్యం కోసం రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య పోరు

అమెరికా సెనేట్‌లో ఆధిపత్యం కోసం రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య పోరు

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి గెలుపు ప్రజా తీర్పు కాదు: వైఎస్ షర్మిల

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి గెలుపు ప్రజా తీర్పు కాదు: వైఎస్ షర్మిల

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. సత్తా చాటుతున్న భారత సంతతి అభ్యర్థులు

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. సత్తా చాటుతున్న భారత సంతతి అభ్యర్థులు

మోదీకి రెండోసారి రాహుల్‌ సవాల్‌

మోదీకి రెండోసారి రాహుల్‌ సవాల్‌

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా ఘన విజయం
ట్యాగ్లు
బీజేపీరాంచందర్‌రావుగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలుతెలంగాణ రాజకీయాలుమహబూబ్‌నగర్రంగారెడ్డిహైదరాబాద్వరంగల్కాంగ్రెస్బీఆర్ఎస్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా ఘన విజయం

విజయవాడలో కూటమి ప్రభంజనం..

విజయవాడలో కూటమి ప్రభంజనం..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం
రాజకీయాలు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

బాలీవుడ్‌లో విలన్‌గా నిత్యామీనన్‌.. కొత్త అవతారంలో నటి
సినిమాలు

బాలీవుడ్‌లో విలన్‌గా నిత్యామీనన్‌.. కొత్త అవతారంలో నటి

రజినీకాంత్ సినిమాలో శ్రీలీలకు లవ్లీ రోల్..
సినిమాలు

రజినీకాంత్ సినిమాలో శ్రీలీలకు లవ్లీ రోల్..

తుఫాన్లతో నష్టపోయిన రైతులకు అండగా సీఎం చంద్రబాబు
జనరల్

తుఫాన్లతో నష్టపోయిన రైతులకు అండగా సీఎం చంద్రబాబు

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణి, ముకేశ్‌పై విమర్శలు.. నామినేషన్స్‌లో హౌస్‌లో రచ్చ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణి, ముకేశ్‌పై విమర్శలు.. నామినేషన్స్‌లో హౌస్‌లో రచ్చ!

సింగరేణి డిస్మిస్డ్ ఉద్యోగులకు మరో అవకాశం..
జనరల్

సింగరేణి డిస్మిస్డ్ ఉద్యోగులకు మరో అవకాశం..

న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు
క్రీడలు

న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ద్వంద్వ వైఖరి.. కవిత విమర్శలు
రాజకీయాలు

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ద్వంద్వ వైఖరి.. కవిత విమర్శలు

దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?
సినిమాలు

దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 1 విడుదల

చిరంజీవి - తుడరుమ్ దర్శకుడి కాంబోలో సినిమా?
గాసిప్స్

చిరంజీవి - తుడరుమ్ దర్శకుడి కాంబోలో సినిమా?

బిగ్‌బాస్ తెలుగు 10: ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఎలిమినేషన్ ముప్పులో టాప్ కంటెస్టెంట్స్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఎలిమినేషన్ ముప్పులో టాప్ కంటెస్టెంట్స్!