4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి గెలుపు ప్రజా తీర్పు కాదు: వైఎస్ షర్మిల

Writer: Nithish 09:37 AM, 4 నవంబర్, 2026
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి గెలుపు ప్రజా తీర్పు కాదు: వైఎస్ షర్మిల

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల విజయం ప్రజా తీర్పు కాదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. ఓట్లు మీరే వేసుకుని, గెలుపు మీదేనని ప్రకటించుకున్నప్పుడు ప్రజలతో, ప్రజాస్వామ్యంతో పనేముందని ప్రశ్నించారు. ఎన్నికల్లో పారదర్శకత, స్వేచ్ఛాయుత వాతావరణం, నిష్పక్షపాతానికి విలువ లేకుండా పోయాయని ఆరోపించారు. అధికార మదంతో, ప్రజల గొంతు నొక్కి, ప్రతిపక్షాలను అణచివేసి కూటమి పార్టీలు బలవంతపు విజయాన్ని సాధించాయని మండిపడ్డారు. ఓటు అనేది రాజ్యాంగం ప్రజలకు కల్పించిన అత్యున్నత హక్కు అని, అలాంటి హక్కును అధికార బలంతో కాలరాశారని విమర్శించారు.

ఎన్నికల సంఘాన్ని కూటమి సంఘంగా మార్చారని, పోలీసు వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని షర్మిల ఆరోపించారు. రౌడీలు, గూండాలతో బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారని, ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించి తరిమేశారని విమర్శించారు. ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో దౌర్జన్యాలకు పాల్పడి బ్యాలెట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారని, ప్రజలను ఓటు వేయకుండా భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ఓటరు తీర్పును తిరగరాసే ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరమని, వ్యవస్థల విధ్వంసానికి పరాకాష్ఠగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలు ఈ పరిణామాలను గుర్తించాలని ఆమె కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా సెనేట్‌లో ఆధిపత్యం కోసం రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య పోరు

అమెరికా సెనేట్‌లో ఆధిపత్యం కోసం రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య పోరు

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. సత్తా చాటుతున్న భారత సంతతి అభ్యర్థులు

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. సత్తా చాటుతున్న భారత సంతతి అభ్యర్థులు

మోదీకి రెండోసారి రాహుల్‌ సవాల్‌

మోదీకి రెండోసారి రాహుల్‌ సవాల్‌

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా ఘన విజయం

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా ఘన విజయం

విజయవాడలో కూటమి ప్రభంజనం..

విజయవాడలో కూటమి ప్రభంజనం..

మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులా? సీఎంఆర్‌ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం

మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులా? సీఎంఆర్‌ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం

ట్యాగ్లు
వైఎస్ షర్మిలవైఎస్ షర్మిల వ్యాఖ్యలుఏపీసీసీఏపీ కాంగ్రెస్మున్సిపల్ ఎన్నికలుకూటమి ప్రభుత్వంపై విమర్శలుఎన్నికల అవకతవకలుప్రజాస్వామ్యంవిజయవాడ వార్తలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కింగ్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్!
సినిమాలు

కింగ్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్!

బిగ్‌బాస్ తెలుగు 10 : అదేంటి.. వర్షిణికి వాళ్లిద్దరూ అలా కౌంటర్ ఇచ్చారేంటి?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 : అదేంటి.. వర్షిణికి వాళ్లిద్దరూ అలా కౌంటర్ ఇచ్చారేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10: హౌస్‌లో రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: హౌస్‌లో రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు

దక్షిణ కోస్తాను ముంచెత్తిన భారీ వర్షాలు
జనరల్

దక్షిణ కోస్తాను ముంచెత్తిన భారీ వర్షాలు

భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లేతో REDMAGIC కొత్త గేమింగ్ ఫోన్ లాంచ్
టెక్నాలజీ

భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లేతో REDMAGIC కొత్త గేమింగ్ ఫోన్ లాంచ్

త్రివిక్రమ్‌కు అసలైన పరీక్ష?
సినిమాలు

త్రివిక్రమ్‌కు అసలైన పరీక్ష?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ, డీఆర్‌ 3 శాతం పెంపు
జనరల్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ, డీఆర్‌ 3 శాతం పెంపు

బాలయ్య, మంచు మనోజ్ మధ్య మాటల యుద్ధం?
సినిమాలు

బాలయ్య, మంచు మనోజ్ మధ్య మాటల యుద్ధం?

అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యోమగాములు
జనరల్

అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యోమగాములు

భోగితో శర్వానంద్ వంద కోట్ల కల నెరవేరేనా?
సినిమాలు

భోగితో శర్వానంద్ వంద కోట్ల కల నెరవేరేనా?

స్టార్‌డమ్‌ కంటే నటనకే ప్రాధాన్యం ఇవ్వాలా?
సినిమాలు

స్టార్‌డమ్‌ కంటే నటనకే ప్రాధాన్యం ఇవ్వాలా?

డబుల్ సెంచరీతో సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసం!
క్రీడలు

డబుల్ సెంచరీతో సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!