

బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రధాని మోదీని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం రెండోసారి సవాలు విసిరారు. ప్రతిపక్షాలు ‘విదేశీ సహాయం’ పొందుతున్నాయంటూ ప్రధాని చేసిన విమర్శపై చర్చకు సిద్ధమా అని సోమవారం సవాలు విసిరారు. తాజాగా ప్రధాని ‘ప్రతిపక్షాలు జాతి వ్యతిరేకులు’ అంటూ విమర్శ చేయగా దానిపైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
‘‘ప్రతిపక్షాలు జాతివ్యతిరేకులని మీరు అంటున్నారు. దీనిపై బహిరంగంగానే చర్చిద్దాం. ప్రదేశాన్ని, వేదికను మీరే ఎంచుకోండి. ఎవరికి విదేశీ శక్తులతో సంబంధాలు ఉన్నాయో, ఎలాంటి సంబంధాలు ఉన్నాయో చర్చిద్దాం. మీకు నచ్చిన వ్యక్తిని జడ్జిగా నియమించుకోండి. మోహన్ భాగవత్‌జీ అయినా ఫరవాలేదు. అమెరికాతో ఒప్పందం.. అదానీ కేసు...ఎఫ్‌స్టీన్ ఫైల్స్.. ఇలా అన్ని అంశాలపై బహిరంగంగానే చర్చిద్దాం. అన్నింటిపైనా స్పష్టత వస్తుంది’’ అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!