

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై విమర్శలు గుప్పించారు. లిటిగేషన్ల పేరుతో అభివృద్ధి పనులు, ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బుధవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. విధ్వంసానికి పాల్పడటం, ఆ తర్వాత కోర్టులను ఆశ్రయించి పనులు, ఎన్నికలను నిలిపివేయాలని చూడటం ప్రతిపక్షానికి అలవాటుగా మారిందని విమర్శించారు.
కోర్టు తీర్పులను సైతం వక్రీకరించేలా కుట్రలు చేస్తున్నారని, వివిధ అంశాలపై సుమారు 60 పిటిషన్లు దాఖలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. పార్టీ అధినేత బెంగళూరులో ఉంటూ విధ్వంసకర చర్యలకు ప్రణాళికలు రచిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారి ఆలోచనలు ఇలాగే ఉంటాయని విమర్శిస్తూ, రాజకీయాల్లో జగన్‌లాంటి వ్యక్తులు లిటిగేషన్లతో వ్యవహరించడం ప్రమాదకరమని అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో జరిగినట్లు తాము భావిస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!