

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో పూర్తయిన ఏడు ప్రాజెక్టులపై గోదావరి నదీ యాజమాన్య బోర్డులో సమీక్షకు చంద్రబాబు లేఖ రాశారని, ఆ అంశాన్ని సమావేశం కార్యసూచిలో చేర్చారని అన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించకుండా తమపై ఎదురుదాడి చేశారని విమర్శించారు.
కేటీఆర్ హెచ్చరికల తర్వాత ప్రాజెక్టులపై సమీక్ష అంశాన్ని ఉపసంహరించుకోవాలని నీటిపారుదల శాఖ ప్రధాన ఇంజినీర్ ద్వారా లేఖ పంపించారని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. సమీక్ష అంశం కార్యసూచిలో లేదంటూ బీజేపీ ఎంపీలు చెబుతున్నారని, అయితే ప్రధాన ఇంజినీర్ లేఖ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు కార్యసూచి నుంచి ఏడు ప్రాజెక్టుల సమీక్ష అంశాన్ని తొలగించాలని, లేకపోతే బీఆర్‌ఎస్ శ్రేణులు సమావేశానికి హాజరై తమ నిరసనను తెలియజేస్తాయని హెచ్చరించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!