

విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని భారాస వ్యతిరేకిస్తోందని మాజీ మంత్రి, భారాస నేత జగదీశ్‌రెడ్డి తెలిపారు. సాగు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ట్రాన్స్‌కోను తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఒడిశా, దిల్లీ, ముంబయిలలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని పేర్కొన్నారు. ఆర్టీసీ, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను మాజీ సీఎం కేసీఆర్ వ్యతిరేకించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా భారాస ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!