
జనరల్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఉన్నారు. నేడు ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు పార్టీకి సంబంధించిన పలువురు నేతలను కలిసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణకు సంబంధించిన అంశాలపై పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లను సీఎం కోరినట్లు సమాచారం.
మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘దళిత, ఆదివాసీ ఆత్మగౌరవ సదస్సు’లో రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. అదే రోజు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి కూడా ఆయన హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన అంశాలతో పాటు పార్టీ పరమైన విషయాలపై అధిష్ఠానం నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్లు వార్తా నివేదికలు పేర్కొంటున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!