
సినిమాలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అక్టోబర్ 5న ప్రముఖ నాయకుడు కాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పేద ప్రజల హృదయాల్లో దీపంలా వెలిగిన మహనీయుడు కాకా వెంకటస్వామి అని సీఎం పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా జి. వెంకటస్వామి ప్రజలకు విశేష సేవలందించారని రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల జీవితాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని తెలిపారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం వెంకటస్వామి నిరంతరం కృషి చేశారని సీఎం కొనియాడారు. ప్రజా సేవ పట్ల ఆయనకున్న నిబద్ధత చిరస్మరణీయమని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!