

కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరులో ఇళ్లు, దుకాణాల కూల్చివేతలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు ప్రశ్నలు సంధించారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా 84 ఇళ్లు, దుకాణాలను కూల్చివేసినట్లు వార్తలు వెలువడ్డాయి. పోలీసు బందోబస్తు మధ్య ఈ చర్యలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న కుటుంబాలకు తగిన నోటీసులు ఇచ్చారా? కూల్చివేతల తర్వాత వారు ఎక్కడికి వెళ్లాలంటూ ప్రశ్నించారు.
కోర్టుల ఆదేశాలను గౌరవిస్తున్నారా? పేదల ఇళ్లపై బుల్డోజర్లను ప్రయోగించడం సమంజసమేనా? అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు న్యాయమైన పరిహారం, పునరావాసం కల్పించాలని భూసేకరణ, పునరావాస చట్టం-2013 ప్రకారం బీఆర్‌ఎస్ తరఫున డిమాండ్ చేశారు. కాగా, కొడంగల్ అభివృద్ధి పనులకు సంబంధించిన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు అధికారిక సమాచారం వెల్లడిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!