

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామంలో సర్పంచ్ పదవికి ఆసక్తికరమైన ప్రకటన వెలువడింది. తనను సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి కోసం రూ.1.50 కోట్లు విరాళంగా అందిస్తానని మాజీ సర్పంచ్ దూడల నాగేశ్వరరావు కుమార్తె, ఎంబీబీఎస్ విద్యార్థిని విశ్వశ్రీ ప్రియ ప్రకటించారు. ఇటీవల గ్రామ మాజీ ఉపసర్పంచ్ తోకల శ్రీనివాస్ కూడా సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి రూ.కోటి విరాళంగా ఇస్తానని ప్రకటించడంతో ఆమె ఈ ప్రకటన చేశారు.
తన తండ్రి దివంగత దూడల నాగేశ్వరరావు, తల్లి రత్నం గతంలో గ్రామ సర్పంచ్‌లుగా పనిచేసి అభివృద్ధికి విశేష కృషి చేశారని విశ్వశ్రీ ప్రియ తెలిపారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ గ్రామానికి సేవ చేయాలన్నది తన కోరిక అని పేర్కొన్నారు. మరో ఏడాదిలో ఎంబీబీఎస్ పూర్తి కానుందని, గ్రామ ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పారు. తనను ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేస్తే గ్రామాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.1.50 కోట్లు విరాళంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!