

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేస్తామని సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఆయనను హిట్లర్‌తో పోల్చుతూ, అంతకన్నా ఎక్కువగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆడపిల్లలు, పేదలకు విద్య దూరం చేసే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖను సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్ విద్యపై గందరగోళం సృష్టించారని, జూనియర్ కాలేజీలకు అఫిలియేషన్లు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. డిగ్రీ అడ్మిషన్లలో కూడా స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం స్పందించలేదని, ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం దారుణమని పేర్కొన్నారు. జీవో నెంబర్ 7 ద్వారా విద్యార్థులపై భారం మోపుతున్నారని, వెంటనే దాన్ని రద్దు చేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!