

ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళనలు 32వ రోజుకు చేరుకోగా, ఉద్యమకారులు తమ డిమాండ్లను మరింత విస్తరించారు. జూలై 20న జరిగిన నిరసనల్లో శాంతియుతంగా పాల్గొన్న వారిపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకూడదని, చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు చేసే ప్రయత్నాలు నిరసనలను మరింత బలోపేతం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం తమ పోరాటం నాలుగు ప్రధాన డిమాండ్లతో కొనసాగుతోందని రాంకా వెల్లడించారు. సోనమ్ వాంగ్‌చుక్‌ను విడుదల చేయడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, జూలై 20న శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై కేసులు నమోదు చేయకపోవడం తమ ప్రధాన డిమాండ్లని తెలిపారు. జూలై 20న పోలీసుల చర్యలు, నిరసనలపై విధించిన ఆంక్షలను ఆయన తీవ్రంగా విమర్శించారు. సీజేపీ ప్రతినిధులతో కేంద్రం తొలిసారి అధికారిక చర్చలు జరిపిన కొద్ది రోజులకే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!