
బిజినెస్

ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువత ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగం, పరీక్ష పేపర్ లీకేజీలు, ఉపాధి అవకాశాల కొరత యువతలో అనిశ్చితి, భవిష్యత్తుపై నిరాశను పెంచుతున్నాయని తెలిపారు. ఈ కారణంగా యువతతో కేంద్ర ప్రభుత్వానికి దూరం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
యువత, విద్యార్థులు తమ హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ, కేంద్రం వారి సమస్యలను పరిష్కరించకుండా అణచివేతకు పాల్పడుతోందని ఆరోపించారు. అరెస్టులు, బెదిరింపులతో ప్రశ్నించే స్వరాలను అణగదొక్కడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ యువతకు అండగా నిలుస్తూ ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదుగుతున్నారని వ్యాఖ్యానించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!