
జనరల్

తెలంగాణలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు, ధృవీకరణ ప్రక్రియలో ముస్లిం ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీతో పాటు ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో మసీదు కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సహకరిస్తూ ఓటరు వివరాల ధృవీకరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
రాష్ట్రంలో సుమారు 45 లక్షల ముస్లిం జనాభా ఉండగా, 30 నుంచి 32 లక్షల వరకు ముస్లిం ఓటర్లు ఉన్నట్లు అంచనా. 30కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి అర్హుడి ఓటు నమోదు కొనసాగేందుకు సమాజంలో అవగాహన కార్యక్రమాలు వేగంగా నిర్వహిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!