

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR), ఓటర్ల జాబితా అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఓటర్ల జాబితా నుంచి పేర్లను ఏకపక్షంగా తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫామ్-6కు సంబంధించిన అదనపు డిక్లరేషన్‌పైనా కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే అసలు ఫామ్-6లో ఎలాంటి మార్పు చేయలేదని, SIR ప్రక్రియలో భాగంగా అదనపు Annexure-Dను ప్రవేశపెట్టినట్లు ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.
యువత, ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు పొందే Gen Z ఓటర్లకు ఈ ప్రక్రియ ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని ఖర్గే ఆరోపించారు. అలాగే గతంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన పలు అంశాలు ప్రస్తుతం చర్చకు రావడాన్ని ప్రస్తావిస్తూ ఆయనను అభినందించారు. పదేళ్ల క్రితం నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని పేర్కొంటూ, ఇప్పుడు ‘ఓటు-బ్యాన్’ పేరుతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఖర్గే ఆరోపించారు. ఇవి SIR, ఫామ్-6పై కొనసాగుతున్న వివాదానికి సంబంధించి కాంగ్రెస్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!