

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలో 582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కేంద్రాల గేట్లను ఎన్నికల సిబ్బంది మూసివేశారు. అయితే, అంతకుముందే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు టోకెన్లు జారీ చేసి, వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం 17,555 పోలింగ్ ప్రాంతాల్లోని 31,472 కేంద్రాల వద్ద 40,679 మంది సిబ్బందిని నియమించారు.
పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే ప్రక్రియకు పటిష్ట భద్రత కల్పించినట్లు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!