
రాజకీయాలు

నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు త్రుటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. దీంతో వీరేశం కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు పాక్షికంగా ధ్వంసమైంది.
నకిరేకల్ నుంచి చినకాపర్తికి వెళ్తుండగా నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అన్నారం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే వేముల వీరేశం మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!