

దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించేందుకు 1950 షెడ్యూల్డ్ కాస్ట్స్ ఆర్డర్‌లోని పేరా–3ను తొలగించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈ విషయాన్ని జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ కమిషన్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆమె తెలిపారు. కాకా కాలేల్కర్ కమిషన్ (1955), మైనారిటీలు–ఎస్సీ–ఎస్టీలపై హై పవర్డ్ ప్యానెల్ (1983), జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ (2007) ఇప్పటికే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని సిఫారసు చేశాయని గుర్తు చేశారు. ఈ నివేదికలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత కమిషన్ సానుకూల సిఫారసు చేయాలని ఆమె కోరారు.
మతం మారినంత మాత్రాన దళితులు ఎదుర్కొనే సామాజిక వివక్ష తొలగిపోదని ఎంపీ కావ్య పేర్కొన్నారు. అందుకే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వడం రాజ్యాంగ సమానత్వ సూత్రాలకు అనుగుణమని చెప్పారు. ఇది మతానికి అతీతంగా అణగారిన వర్గాలకు సమాన హక్కులు, రక్షణ కల్పించడంలో సహాయపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!