

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వర్షపు నీటి నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాలు కురిసినప్పుడు వరదల రూపంలో వచ్చే నీటిని వృథాగా సముద్రంలోకి వెళ్లనివ్వకుండా ముందుగానే అంచనా వేసి నిల్వ చేయడం సమర్థవంతమైన నీటి యాజమాన్యానికి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రిజర్వాయర్లు, కాలువలు, సాగునీటి వ్యవస్థలు, ఇతర నీటి వనరుల ద్వారా నీటిని అందుబాటులోకి తెచ్చి వ్యవసాయం, భవిష్యత్ తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. భారీ వర్షాల సమయంలో క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసిన అధికారులు, సిబ్బందిని లోకేష్ అభినందించారు.
ఇదే సందర్భంలో ‘Pixels to Pipes’ అనే ఆలోచనను కూడా నారా లోకేష్ ప్రస్తావించారు. ఉపగ్రహాలు, డిజిటల్ టెక్నాలజీ, డేటా ఆధారంగా వర్షపాతం, నీటి ప్రవాహాలను ముందుగానే అంచనా వేసి, ఆ సమాచారాన్ని క్షేత్రస్థాయి నీటి నిర్వహణ వ్యవస్థతో అనుసంధానించడమే దీని ఉద్దేశంగా వివరించారు. ఎక్కడ ఎంత వర్షం పడుతోంది, ఎంత నీరు ప్రవహిస్తోంది, ఎక్కడ నిల్వ చేయవచ్చు, చివరకు ఆ నీటిని రైతులకు ఎలా అందించాలనే అంశాలను ఒక సమగ్ర వ్యవస్థగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాన్ని ముందే అంచనా వేసి, అందుబాటులోకి వచ్చే ప్రతి చుక్క నీటిని సాధ్యమైనంత మేర వినియోగించుకోవడమే సమర్థవంతమైన నీటి నిర్వహణకు కీలకమని ఆయన పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!