23, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాజకీయాలతో సంబంధం లేదు.. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించం: డీజీపీ

Writer: Shivani K 11:35 PM, 22 అక్టోబర్, 2026
రాజకీయాలతో సంబంధం లేదు.. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించం: డీజీపీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తీవ్రంగా స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, నామినేషన్ పత్రాలను చింపేసినా, పోలీసులపై దాడులకు పాల్పడినా ఎంతటి వారినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, వ్యక్తుల హోదాలతో సంబంధం లేకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 31 ఘటనలు నమోదైనట్లు డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వీటిలో 22 ఘర్షణలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఘటనలు కాగా, మరో తొమ్మిది చోట్ల నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని చింపేసినట్లు వెల్లడించింది.

కనీసం ఆరు చోట్ల రాళ్లు, కర్రలతో దాడులు జరగగా, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. రెండు నివాస గృహాలపై దాడులు జరగడంతో పాటు, ఒక ఇంటిని జేసీబీతో కూల్చివేసిన ఘటన కూడా చోటుచేసుకుంది. అభ్యర్థులకు రక్షణగా వెళ్తున్న పోలీసు వాహనంపై రాళ్లదాడి జరిగినట్లు వెల్లడించింది. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేయగా, మరో 11 ఘటనల్లో కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది. సీసీటీవీ ఫుటేజీలు, వీడియోలను పరిశీలించి మరిన్ని అరెస్టులు చేసే అవకాశం ఉందని తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడబోమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతర పోరాటం - కేటీఆర్

సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతర పోరాటం - కేటీఆర్

ఎన్నికల్లో గెలవలేకే వైకాపా అరాచకాలు.. నాదెండ్ల మనోహర్‌ తీవ్ర విమర్శలు

ఎన్నికల్లో గెలవలేకే వైకాపా అరాచకాలు.. నాదెండ్ల మనోహర్‌ తీవ్ర విమర్శలు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపు పై ఆరోపణలు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపు పై ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు..

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు..

ఫాక్స్ న్యూస్ నివేదికపై బీజేపీ విమర్శలు.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు

ఫాక్స్ న్యూస్ నివేదికపై బీజేపీ విమర్శలు.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు

ఎల్. మురుగన్ రాజీనామా తర్వాత రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్.. కేబినెట్ విస్తరణపై చర్చ

ఎల్. మురుగన్ రాజీనామా తర్వాత రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్.. కేబినెట్ విస్తరణపై చర్చ

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుఎంపీటీసీ ఎన్నికలుజడ్పీటీసీ ఎన్నికలునామినేషన్ల ప్రక్రియడీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాఎన్నికల హింసశాంతిభద్రతలుపోలీసులపై దాడినామినేషన్ పత్రాలుఎన్నికల భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మధుమిత సర్కార్ హీరోయిన్‌గా ‘మాయలేడి’.. విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్
సినిమాలు

మధుమిత సర్కార్ హీరోయిన్‌గా ‘మాయలేడి’.. విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్

రాజకీయాలతో సంబంధం లేదు.. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించం: ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్
రాజకీయాలు

రాజకీయాలతో సంబంధం లేదు.. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించం: ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్

ఉత్తర టిబెట్‌లో భారీ భూకంపం
జనరల్

ఉత్తర టిబెట్‌లో భారీ భూకంపం

బిగ్ బాస్ తెలుగు 10 డే 46: ఊహించని ట్విస్ట్.. గోట్స్‌గా అమన్, నీతూ, దేబ్జానీ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 46: ఊహించని ట్విస్ట్.. గోట్స్‌గా అమన్, నీతూ, దేబ్జానీ

ప్రపంచ శాంతికి భారత్ మద్దతు.. మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

ప్రపంచ శాంతికి భారత్ మద్దతు.. మోదీ కీలక వ్యాఖ్యలు

సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతర పోరాటం - కేటీఆర్
రాజకీయాలు

సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతర పోరాటం - కేటీఆర్

నిరసనలకు హద్దులు ఉండాలి.. కాంగ్రెస్‌కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సవాల్
జనరల్

నిరసనలకు హద్దులు ఉండాలి.. కాంగ్రెస్‌కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సవాల్

ఎన్నికల్లో గెలవలేకే వైకాపా అరాచకాలు.. నాదెండ్ల మనోహర్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఎన్నికల్లో గెలవలేకే వైకాపా అరాచకాలు.. నాదెండ్ల మనోహర్‌ తీవ్ర విమర్శలు

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై కీలక ప్రకటన
జనరల్

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై కీలక ప్రకటన

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధం.. ఇన్‌చార్జీలను ప్రకటించిన కేటీఆర్
జనరల్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధం.. ఇన్‌చార్జీలను ప్రకటించిన కేటీఆర్

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ అధికారి నవీన్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డు
జనరల్

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ అధికారి నవీన్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డు

వైభవ్ సూర్యవంశీపై ప్రపంచవ్యాప్తంగా క్రేజ్.. రవిశాస్త్రి కీలక సూచన
క్రీడలు

వైభవ్ సూర్యవంశీపై ప్రపంచవ్యాప్తంగా క్రేజ్.. రవిశాస్త్రి కీలక సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!