

పిఠాపురం నియోజకవర్గంలోని మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో కాకినాడ జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో, 7వ తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు అడ్మిషన్లు లేవంటూ 'నో అడ్మిషన్' బోర్డు ఏర్పాటు చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయుల కృషి, బోధనేతర సిబ్బంది సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 'నో అడ్మిషన్' బోర్డు పెట్టే స్థాయికి ఈ పాఠశాలను తీసుకువచ్చిన సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు. పిఠాపురం పర్యటన సందర్భంగా మూలపేట జెడ్పీ హైస్కూల్‌ను సందర్శిస్తానని హామీ ఇచ్చిన ఆయన, నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈ విజయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!