
సినిమాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వాట్సాప్ ద్వారా లేఖ పంపించారు. ఆ లేఖతో పాటు వీడియోలు, ఇతర ఆధారాలను కూడా పంపినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణాలపై ముఖ్యమంత్రి, మంత్రులు పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఆధారాలతో సహా వివరాలు వెల్లడించినప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం బాధాకరమని హరీష్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్ల కాలంలో మొత్తం రూ.4.17 లక్షల కోట్ల రుణాలే తీసుకుందని స్పష్టం చేశారు. ఆ లెక్కలకు తాను కట్టుబడి ఉన్నానని, ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని అసెంబ్లీలోనే ప్రకటించిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!