

ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. అయితే జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని లేదా విధుల నుంచి తప్పించాలని కోరిన మధ్యంతర అభ్యర్థనపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. సీఈసీపై చర్యలు తీసుకోవడం అసాధారణమైన విషయమని ధర్మాసనం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చీ, వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
ఎన్నికల సంఘం తీసుకున్న 14 నిర్ణయాలు ఇతర కమిషనర్ల సమ్మతి లేకుండానే తీసుకున్నారన్నది పిటిషనర్ల ప్రధాన ఆరోపణ. ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరిన సుప్రీంకోర్టు.. రికార్డులను పరిశీలించిన తర్వాత చట్టానికి విరుద్ధంగా ఉన్నట్లు తేలితే సంబంధిత నిర్ణయాలను రద్దు చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మీడియా కథనాల ఆధారంగా మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కూడా ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల కమిషనర్ల నిర్ణయ ప్రక్రియ, చట్టపరమైన నిబంధనల అమలుపై తదుపరి విచారణలో కోర్టు పరిశీలన కొనసాగనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!