
జనరల్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు, ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పదవిని చేపట్టారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం జూన్ 26న సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటి వరకు సీఎస్‌గా పనిచేసిన కే. రామకృష్ణా రావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఉన్న ఉన్నతాధికారులు, విభాగాధిపతులు, సిబ్బంది కొత్త సీఎస్‌ను అభినందించగా, పదవీ విరమణ చేసిన రామకృష్ణా రావును సత్కరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!