5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కడప పరిషత్‌ ఎన్నికల్లో కూటమి జోరు.. పట్టు నిలుపుకునేందుకు వైఎస్సార్‌సీపీ పోరాటం

Writer: Chandrika 12:35 PM, 5 నవంబర్, 2026
కడప పరిషత్‌ ఎన్నికల్లో కూటమి జోరు.. పట్టు నిలుపుకునేందుకు వైఎస్సార్‌సీపీ పోరాటం

కడప జిల్లా పరిషత్‌ పీఠాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పటికే దక్కించుకునే దిశగా ముందంజలో ఉంది. జిల్లాలో మొత్తం 39 జడ్పీటీసీ స్థానాలకు గాను 23 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో జడ్పీ అధ్యక్ష పదవికి అవసరమైన స్థానాలను కూటమి సాధించింది. అదేవిధంగా మొత్తం 405 ఎంపీటీసీ స్థానాల్లో 350 చోట్ల కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. దీంతో 34 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులు కూడా కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన 16 జడ్పీటీసీ, 55 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాల్లోనూ పట్టు సాధించాలని కూటమి ప్రయత్నిస్తుండగా.. జిల్లాలో తమ రాజకీయ పరువు నిలుపుకోవాలని వైఎస్సార్‌సీపీ పోరాడుతోంది.

జిల్లాలో మొత్తం 5,94,099 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో జడ్పీటీసీ పరిధిలో 4,47,809 మంది, ఎంపీటీసీ పరిధిలో 1,46,290 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 71 మంది జడ్పీటీసీ, 171 మంది ఎంపీటీసీ అభ్యర్థులు కలిపి 242 మంది బరిలో నిలిచారు. 599 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు 3,912 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 599 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 599 మంది సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, 2,396 మంది ఇతర పోలింగ్‌ సిబ్బంది ఉన్నారు. 292 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. మొత్తం కేంద్రాల్లో 134 సున్నితమైనవి, 167 అత్యంత సున్నితమైనవి, ఐదు సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు భద్రత కల్పించారు. ఏడుగురు డీఎస్పీల పర్యవేక్షణలో 37 మంది సీఐలు, 76 మంది ఎస్సైలు, 1,027 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అవసరమైతే శుక్రవారం రీపోలింగ్‌ నిర్వహిస్తారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. బద్వేలు, జమ్మలమడుగు, కడప, పులివెందుల, రాజంపేట రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పలు మండలాల్లో ఈ ఎన్నికల పోరు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రాదేశిక ఎన్నికల్లో డబ్బుల పంపిణీ.. మార్కాపురం, ప్రకాశంలో ఓటుకు నోటు!

ప్రాదేశిక ఎన్నికల్లో డబ్బుల పంపిణీ.. మార్కాపురం, ప్రకాశంలో ఓటుకు నోటు!

రిగ్గింగ్ ఆరోపణలపై పరిటాల సునీత ఘాటు స్పందన

రిగ్గింగ్ ఆరోపణలపై పరిటాల సునీత ఘాటు స్పందన

అనవసర గొడవలకు దూరంగా ఉండండి..కార్యకర్తలకు జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచన

అనవసర గొడవలకు దూరంగా ఉండండి..కార్యకర్తలకు జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచన

కడప రాజకీయాల్లో టాపిక్‌గా మారిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి

కడప రాజకీయాల్లో టాపిక్‌గా మారిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి

ప్రత్యర్థులనే తన వర్గంలోకి చేర్చుకున్న పెద్దిరెడ్డి.. పీలేరులో రాజకీయ వ్యూహాలివే!
ట్యాగ్లు
కడప ఎన్నికలుజడ్పీటీసీ ఎన్నికలుఎంపీటీసీ ఎన్నికలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలుకూటమి ప్రభుత్వంవైఎస్సార్‌సీపీస్థానిక సంస్థల ఎన్నికలుకడప జిల్లాపోలింగ్ ఏర్పాట్లుఎన్నికల ఫలితాలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ప్రత్యర్థులనే తన వర్గంలోకి చేర్చుకున్న పెద్దిరెడ్డి.. పీలేరులో రాజకీయ వ్యూహాలివే!

ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై బీజేపీ మాటలు కోటలు దాటుతున్నాయి.. కేటీఆర్ విమర్శలు

ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై బీజేపీ మాటలు కోటలు దాటుతున్నాయి.. కేటీఆర్ విమర్శలు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రికెట్‌లోనే కాదు.. బ్రాండ్ ప్రపంచంలోనూ కింగ్ కోహ్లీ
క్రీడలు

క్రికెట్‌లోనే కాదు.. బ్రాండ్ ప్రపంచంలోనూ కింగ్ కోహ్లీ

అమ్మవారిని దర్శించుకున్న నయనతార.. మహిళలకు చీరల పంపిణీ
సినిమాలు

అమ్మవారిని దర్శించుకున్న నయనతార.. మహిళలకు చీరల పంపిణీ

పంజాబ్ డ్రగ్స్ సమస్యపై అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్
రాజకీయాలు

పంజాబ్ డ్రగ్స్ సమస్యపై అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్

కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చిన బోటు.. అందులో నాలుగు మృతదేహాలు!
జనరల్

కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చిన బోటు.. అందులో నాలుగు మృతదేహాలు!

కొత్త ఓటర్లకు ఊరట.. ఓటరు నమోదు నిబంధనల్లో ఈసీ కీలక మార్పులు
జనరల్

కొత్త ఓటర్లకు ఊరట.. ఓటరు నమోదు నిబంధనల్లో ఈసీ కీలక మార్పులు

రామాయణం ఇండియన్ సినిమాకు గ్లోబల్ టర్నింగ్ పాయింట్ అవుతుంది.. విజయ్ దేవరకొండ
సినిమాలు

రామాయణం ఇండియన్ సినిమాకు గ్లోబల్ టర్నింగ్ పాయింట్ అవుతుంది.. విజయ్ దేవరకొండ

ప్రాదేశిక ఎన్నికల్లో డబ్బుల పంపిణీ.. మార్కాపురం, ప్రకాశంలో ఓటుకు నోటు!
రాజకీయాలు

ప్రాదేశిక ఎన్నికల్లో డబ్బుల పంపిణీ.. మార్కాపురం, ప్రకాశంలో ఓటుకు నోటు!

రిగ్గింగ్ ఆరోపణలపై పరిటాల సునీత ఘాటు స్పందన
రాజకీయాలు

రిగ్గింగ్ ఆరోపణలపై పరిటాల సునీత ఘాటు స్పందన

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు
జనరల్

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు

అనవసర గొడవలకు దూరంగా ఉండండి..కార్యకర్తలకు జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచన
రాజకీయాలు

అనవసర గొడవలకు దూరంగా ఉండండి..కార్యకర్తలకు జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచన

తిరుమల లడ్డూ కల్తీ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
జనరల్

తిరుమల లడ్డూ కల్తీ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

కడప రాజకీయాల్లో టాపిక్‌గా మారిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
రాజకీయాలు

కడప రాజకీయాల్లో టాపిక్‌గా మారిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి