

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. తనపై ఇరాన్ హత్యాయత్నానికి పాల్పడితే అమెరికా నుంచి భారీ సైనిక ప్రతీకారం తప్పదని తెలిపారు. తన సామాజిక మాధ్యమ వేదిక 'ట్రూత్ సోషల్'లో చేసిన పోస్టులో, అలాంటి పరిస్థితి ఎదురైతే విస్తృత స్థాయిలో క్షిపణి దాడులు నిర్వహించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని, అవసరమైన ఆదేశాలు ఇప్పటికే సైన్యానికి ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. తనపై దాడి జరిగితే ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
గతంలో కూడా తనపై ఇరాన్ నుంచి ముప్పు ఉందని ట్రంప్ ఆరోపించారు. అలాంటి ప్రయత్నం జరిగితే అమెరికా ప్రతిస్పందన అత్యంత తీవ్రంగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, ఇరాన్ అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధి భద్రత, ప్రాంతీయ ఉద్రిక్తతలు వంటి అంశాలపై ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో మరింత చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!