
రాజకీయాలు

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, మధుయాష్కి గౌడ్ పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శులు సచిన్ సావంత్, సంపత్, వంశీ చంద్, హర్కర వేణుగోపాల్ కూడా విమానాశ్రయానికి చేరుకుని రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!