
క్రీడలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యవహారశైలితో మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా నిర్వహించిన “మీట్ ది ప్రెస్” ఇంటర్వ్యూలో ఆయన ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధం, గత ప్రభుత్వ విధానాలు, యాంటీ వెపనైజేషన్ స్కీమ్‌పై ప్రశ్నలు ఎదుర్కొన్న ట్రంప్, జో బైడెన్ మరియు మీడియాపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే 2020 అమెరికా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని తన ఆరోపణలను మళ్లీ పునరుద్ఘాటించారు.
అయితే ఈ ఆరోపణలకు ఆధారాలు చూపాలని హోస్ట్ క్రిస్టెన్ వెల్కర్ పదేపదే అడగడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. చర్చ వేడెక్కిన సమయంలో “ఇక చాలు” అంటూ మైక్రోఫోన్‌ను తీసి కింద పడేసి ఇంటర్వ్యూను మధ్యలోనే ముగించారు. కొనసాగించాలని హోస్ట్ కోరినా, ఇప్పటికే తగిన సమయం ఇచ్చానని చెప్పి ట్రంప్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!