

వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిబద్ధత, పరిపాలనా సంస్కరణలకు ఆకర్షితులై తుని నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు యనమల కృష్ణుడు, హిందూపురం సీనియర్ వైసీపీ నాయకుడు నవీన్ నిశ్చల్ తదితరులు శుక్రవారం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరినట్లు పార్టీ వెల్లడించింది.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ నాయకుడు, ఏలూరు డీసీసీబీ మాజీ ఛైర్మన్ పీవీఎల్ఎన్ నరసింహరాజు, వైసీపీ పరిశీలకుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు అయితాబత్తుల సుభాషిణి, తుని వైసీపీ నాయకుడు పొలినాటి శేషగిరిరావు, తణుకు వైసీపీ నాయకుడు దిరిశాల కృష్ణ శ్రీనివాస్, శ్రీకాళహస్తికి చెందిన సత్రవాడ ప్రవీణ్, మిద్దెల హరి, ముమ్మడివరం మాజీ ఏఎంసీ ఛైర్మన్ కుడిపూడి శివన్నారాయణ, నరసరావుపేటకు చెందిన ఏలూరి ప్రసాద్ తదితరులు కూడా పార్టీలో చేరినట్లు జనసేన తెలిపింది. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!