

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతానికి ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్ఈసీ) కోరింది. రాజకీయ పార్టీల సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ప్రతినిధులు పలు కీలక డిమాండ్లను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును ఒకేసారి చేపట్టాలని, ఎన్నికల ప్రక్రియ మొత్తం పోలీసులు, అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులకు మరింత సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్సీపీ సూచించింది. కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల్లోనూ నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరింది. అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నికల సమయంలో సున్నితమైన అంశాలపై తప్పుడు ప్రచారం జరగకుండా అడ్డుకోవాలని, వదంతులు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!