
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ విడతలో ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని స్థానిక ప్రజాప్రతినిధులను ఎన్నుకోనున్నారు. నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండో విడతలో మొత్తం 1,171 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,803 సర్పంచ్ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామాల్లో ఓటింగ్ ద్వారా సర్పంచ్‌లను ఎన్నుకోనున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో రెండో విడత పోలింగ్ కీలకంగా మారనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!